TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిబిఐపై అంబటి అనుమానాలు

Published on: Tue Jan 3, 2012 3:44PM

హైదరాబాద్: న్యాయవ్యవస్థ, సిబిఐపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో అన్నారు. వైయస్ జగన్ ను సిబిఐ అరెస్టు చేస్తుందని తాము భావించడం లేదని అయన   అన్నారు.అరెస్టులతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వేధించాలని చూస్తున్నారన్నారు. జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు ముందుగా ఊహించిందేనన్నారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. బుధవారం అన్ని జిల్లాల్లో ఫీజు పోరు ఆందోళన ఉంటుందన్నారు. జగన్ ఒంగోలులో పాల్గొంటారన్నారు. అవిశ్వాసం సమయంలో విప్ ధిక్కరించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు వేటు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఉప ఎన్నికల భయంతోనే ఎమ్మెల్యేలపై వేటు వేయడం లేదని ఆయన అన్నారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు డిపాజిట్ కూడా దక్కదన్నారు.కాగా   జగన్‌ను అరెస్టు చేస్తారనే వార్తలు పూర్తి అబద్ధమని, అవన్నీ కేవలం వట్టి ప్రచారం మాత్రమేనని మరో నేత మహేందర్ రెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ సిబిఐని పావుగా వాడుకుంటోందన్నారు. విజయ సాయి రెడ్డి అరెస్టు కక్ష సాధింపు అన్నారు.