లోక్పాల్ పరిధిలో సీబీఐని చేర్చాలి: బాబు డిమాండ్
Published on: Wed Dec 21, 2011 10:25AM
హైదరాబా
ద్: ప్రభుత్వాధీనంలో ఉన్న సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని కనుక లోక్పాల్ పరిధిలో సీబీఐని చేర్చాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్పాల్ పరిధిలో సీబీఐని చేర్చడం ద్వారా అవినీతిరహిత భారత్ తయారవుతుందని చంద్రబాబు తెలిపారు.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అనుసరిస్తున్న పద్ధతులు మంచివి కావని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులను ప్రభుత్వం సమర్థిస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయల్ రాజకీయాలకు పాల్పడుతోందని చంద్రబాబు చెప్పారు. లోక్పాల్ బిల్లును అడుగడుగునా నీరుగార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారే తప్ప ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు.


