కావేరి జల వివాదంపై సుప్రీం కీలక తీర్పు..

 

కావేరి జల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. కావేరి జలాలపై ఏ రాష్ట్రానికి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కార్ణటకకు అదనంగా 14.50 టీఎంసీల.. బెంగుళూరు తాగునీటి అవసరాల కోసం 4.75 కేటాయించింది. ఇంకా 2007లో తమిళనాడుకు 192 టీఎంసీలు కేటాయించిన కోర్టు.. ఈసారి తగ్గించింది. తమిళనాడుకు 177 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటకకు కోర్టు ఆదేశించింది. కేరళ, పుదుచ్చేరికి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.