మతం మారితే పెన్షన్లు
Published on: Mon Mar 19, 2012 11:19AM
రాష్ట్రంలో మత మార్పిడిలు వివాదస్పదంగా మారుతున్నాయి. మతం పేరుతో అమాయకులను ప్రలోభ పెట్టడమే కాకుండా మతం మార్చుకుంటే పెన్షన్ ఇస్తామంటూ కొందరు క్రైస్తవ ప్రచారకులు రాయలసీమ జిల్లాల్లో తిరుగుతున్నారు. చెన్నై కేంద్రంగా చేసుకున్న ఈ క్రైస్తవ ప్రచారకులు రాయలసీమ ప్రాంతాలోని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి దళితులకు ఆర్ధికపరమైన ప్రయోజనం చూపిస్తూ మత మార్పిడిలకు పాల్పడుతున్నారు. మతం మార్చుకున్న వారికి భవిష్యత్తులో నెలకు రూ. 500 చొప్పున పెన్షన్ ఇస్తామని వారు హామీ ఇస్తున్నారు. మరికొంతమంది ఫాస్టర్ల అవతారం ఎత్తి నిరుపేద కుటుంబాలను మనీ సర్క్యులేషన్ స్కీములలో జాయిన్ చేస్తున్నారు. కోస్తా జిల్లాల్లో వేలాది కుటుంబాలు ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీముల ఉచ్చుల్లో ఇప్పటికే చిక్కుకున్నాయి. దేవుడి పేరుతో ప్రచారం చేసే క్రైస్తవులు ఇటువంటి మోసాలు చేయరనే నమ్మకంతో వారు చెబుతున్న సంస్థల్లో నిరుపేదలు చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెడుతున్నారు.
తరువాత ఈ సంస్థలు బోర్డు తిప్పేయడంతో వారు లబోదిబోమంటున్నారు, ఇటువంటి సంఘటనల తరువాత కొంతమంది ఫాస్టర్లు సొంత వూళ్ళను వదిలి పారిపోయారు. క్రైస్తవ మత మార్పిడిలు మన రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి మన రాష్ట్రంలో ఉన్నన్ని చర్చిలు మరే రాష్ట్రంలోనూ లేవు. రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెలో చూసినా చర్చిలు కనిపిస్తున్నాయి. దీనికితోడు కనిపించే ప్రతికొండపైనా సిలువ గుర్తులు వేసి అక్కడ చిన్న చిన్న చర్చిలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల్లో ఒక మతానికి చెందినవారు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నా వారిని అడ్డుకునే వారెవరూ కనిపించలేదు. కొంతకాలం పోతే రాష్ట్రంలోని కొండలన్నీ చర్చిలతో నిండిపోతాయని అది హిందూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ అల్లురి చెంగయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత మార్పిడిలపై ప్రభుత్వం వెంటనే మేల్కొని మతం పేరుతో మోసాలకు పాల్పడేవారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.


