జీడిపప్పుకు విదేశీ దెబ్బ
Published on: Fri Feb 24, 2012 1:44PM
గణనీయంగా తగ్గిన ధరలు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
హైద
రాబాద్: రాష్ట్రంలో జీడిపప్పును ఎక్కువగా సేద్యం చేస్తున్న జిల్లాల్లో తూర్పుగోదావరి ఒకటి. ఇక్కడ పండే జీడిపప్పుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు వీదేశాలనుంచి వెల్లువలా వచ్చిపడుతున్న జీడిపప్పుతో ఇక్కడి జీడిపప్పు పరిశ్రమ కుదేలయింది. దీంతో జీడిపప్పు ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. జీడిపప్పు తయారీ ఎగుమతిదారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 40వేల హెక్టార్లలో జీడిమామిడి సాగవుతుండగా 30 వరకు ఫ్యాక్టరీలున్నాయి. వీటిలో 7 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలో మూడు వందల రోజులు ఈ ఫ్యాక్టరీలో జీడిపప్పు తయారు చేస్తుంటారు. ఇటీవల మహారాస్గ్త్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ల ద్వారా రాష్ట్రానికి వస్తున్న విదేశీ జీడిపప్పుతో స్థానిక ఉత్పత్తిదారుల వ్యాపారం దెబ్బతింది. ఈ విదేశీ జీడిపప్పు ధరలు తక్కువగా ఉండటంతో పాటు దేశీయ జీడిపప్పురేటు రోజు రోజుకు క్షీణిస్తోంది. గతంలో పోల్చితే కిలోకు రూ.60 నుంచి రూ.80 వరకు రేటు పడిపోయింది. దీనికితోడు ఉత్తర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జీడిపప్పు పరిశ్రమల నిర్వాహకులు ఇబ్బందులు పడుతుండగా మరో కొద్ది ప్రారంభం కానున్న సీజన్ లో రైతులు కూడా విలవిలలాడే పరిస్థితి ఏర్పడబోతోంది.


