TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓటుకు నోటుపై రేవంత్ రెడ్డి... మోదీ, కేసీఆర్‌ కలిసి ఆడుతున్న నాటకం..

Published on: Tue May 8, 2018 5:53PM

 

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈకేసుపై పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సమీక్ష నిర్వహించారు. దీంతో ఉన్నట్టుండి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఈ కేసుపై మళ్లీ ఇంట్రస్ట్ చూపించడంపై అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటుండగా..ఈ కేసులో ఇప్పటికే జైలుకి వెళ్లివచ్చిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని భయపెట్టో, బెదిరించో లొంగదీసుకుని రాజకీయ పరంగా కొందరు ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి ఆడుతోన్న నాటకంలో భాగమే నిన్నటి వ్యవహారమని అన్నారు.  ఓటుకు నోటు కేసుకి సంబంధించి వివరాలు చెప్పాలని తాను అనుకోవట్లేదని, ఈ విషయంపై మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్ తీరుని మాత్రం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని..రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం నిన్న పలువురు అధికారులతో కేసీఆర్ ఏడు గంటలు ఓటుకు నోటు కేసుపై చర్చించారని అన్నారు.