కవిత మీద కేసు నమోదు
Published on: Mon Aug 11, 2014 3:59PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవితపై మాదన్నపేట పోలీసులు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా భారత్లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా వున్నాయంటూ బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఐపీసీ 124 (ఏ), 153 (ఏ), 505, సీఆర్‌పీసీ156 (3) సెక్షన్ల కింద కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు.


