TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యడ్లపాడు పీఎస్ లో విడదల రజనీపై కేసు

Published on: Tue Feb 3, 2026 1:00PM

మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదైంది. గత నెల 30న విడదల రజనీ తన అనుచరులతో కలిసి యడ్లపాడులోని ఆలయానికి వెళ్లారు.   తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని  పేర్కొంటూ,  ఆలయాన్ని శుద్ధి చేయడానికి  యత్నించారు. ఆ సందర్భంగా  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. అయితే తాను ఆలయంలోకి వెళ్లి శుద్ధి కార్యక్రమం చేస్తానని ఆమె పట్టుబట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ దశలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.  ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై... నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి.  పరిస్థితి చూస్తుంటే.. వైసీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా శాంతి భద్రతల పరిస్థితికి భంగం వాటిల్లేలా చేసి  తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే వ్యూహంతో ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని బూచిగా చూపి పెట్టుబడి దారులను బెదరించడమనే కుట్రకోణం దీని వెనుక ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.