TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూట్యూబర్ హర్షసాయిపై ఆరోపణలు కొత్తేం కాదు

Published on: Wed Sep 25, 2024 10:45AM

యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగ్ పోలీసులు అత్యాచారం, బ్లాక్ మెయిల్, హత్యాయత్నం తదితర కేసులు నమోదు చేశారు. ముంబైకి చెందిన యువతిని హర్షసాయి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆమె వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలను హర్షసాయి వసూలు చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేసినట్లు ఆ యువతి హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.  సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వివాదం సద్దుమణగకముందే  కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కేసులు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి.   తాజాగా యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.హర్షసాయిపై గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి.