ఆర్జీవీపై రాయదుర్గం పీఎస్ లో కేసు
Published on: Thu Sep 18, 2025 3:35PM
.webp)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వివాదాలలో ఉండే రామ్ గెపాల్ వర్మపై మాజీ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. మావోయస్టులపై గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన దహనంవెబ్ సీరిస్ కు సంబంధించి అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు.
ఆ వెబ్ సిరీస్ లో అంజనా సిన్హా పేరును ప్రస్తావిస్తూ.. అంజనాసిన్హా చెప్పిన విధంగానే ఆ వెబ్ సిరీస్ లో కొన్ని సీన్లు తీశామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్లో తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరు వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


