TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొగుడు తిట్టినందుకు కాదు.. తోడి కోడలు నవ్వినందుకు..! బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

Published on: Tue Jun 7, 2022 12:31PM

జూబ్లీహిల్స్ హైప్రొఫైల్ రేప్ కేసులో పోలీసుల తీరు విడ్డూరంగా ఉంది. మొగుడు తిట్టినందుకు కాదు..తోడికోడలు నవ్వినందుకు అన్నట్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను కాపాడేందుకు, కేసును తప్పుదోవ పట్టించేందుకు శతధా ప్రయత్నించిన  హైదరాబాద్ పోలీసులు ఆ అత్యాచారం విషయంలో పోలీసుల తీరును తప్పుపడుతూ వాస్తవాలను వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందరనావుపై మాత్రం ఆఘమేఘాలపై కేసు నమోదు చేశారు.

  జూబ్లిహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో   బాలికపై అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు.

బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు. ఆ వీడియోలు  సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పోలసుల వైఫల్యంపై విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే   వీడియోలను బహిర్గతం చేసినందుకుగాను అబిడ్స్ పోలీసులు ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు.   బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన సుభాన్‌ అనే వ్యక్తికి ఇప్పటికే సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సుప్రింకోర్టు ఆదేశాల మేరకు అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయట పెడితే నేరం కనుకనే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతుంటే.. తాను చూపించిన వీడియోలో ఎక్కడ బాధితురాలి ముఖం కనిపించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. రఘునందనరావు మీడియాసమావేశం తరువాతనే పోలీసులు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారన్న విషయం మాత్రం ఎవరూ కాదనలేరు.

ఇప్పటికీ ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్న దాఖలాలూ లేవు. ఎమ్మెల్యేపై ఆఘమేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మీడియా సమావేశంలో బాధితురాలి వివరాలు వెల్లడించి ఉంటే ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవలసిందే.. దానిని ఎవరూ  కాదనరు. కానీ అంత కంటే ముందు అత్యాచారానికి పాల్పడిని నిందితులను అరెస్టు చేసి వారిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది.