TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదివాసీల‌ను ప‌ట్టించుకోరా.. షర్మిల‌

Published on: Fri Jul 22, 2022 10:40AM

మ‌నుషుల్లో మాన‌వ‌త్వం న‌శించింది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల జ‌నాలు త‌ప్ప ఆదివాసీల‌ను ప‌ట్టించుకోని నాయకులు త‌యార‌య్యారు. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా ఆదివాసీల విష‌యానికి వ‌చ్చేస‌రికి  నీర‌స ప‌డుతుండ‌డం ఎప్ప‌టినుంచో జ‌రుగుతోంది. మంచిర్చాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం కోయ‌పోచ‌గూడ ఆదివాసీల‌కు తాత్కాలిక నివాసాల‌ను ఈ నెల ఎనిమిదో తేదీన అట‌వీ ఆధికారులు తొల‌గించి మ‌హిళ‌ల‌ను ఏడ్చుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇంత క్రూరంగా ఎలా ప్ర‌వ‌ర్తించార‌ని ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన వై ఎ స్సా ర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. 

దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ మహిళలను ఆమె పరామర్శించారు. ఆదివాసీల సమస్య లను తెలుసుకున్నారు. భూముల కోసం 52 కుటుంబాలు పోరాడుతున్నాయని, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.  కేసీఆర్‌ పాలనలో ఆడవారికి కనీస రక్షణ కూడా లేదని ఆవే దన చెం దారు. పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ మహిళలను బట్టలూడదీసి కొడతారా? ఇంత‌కంటే నీచ సంస్కృతి ఏమ‌న్నా ఉంటుందా అని ఆమె ప్ర‌శ్నించార

పోడు భూముల్లో పట్టాల కోసం ఆదివాసీల తరపున పోరాడతానని చెప్పారు. అనంతరం  ఆమె మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలో వర్షాల కారణంగా ఇల్లు మునిగి, ఆస్తినష్టం జరగడంతో ఆత్మహత్య చేసుకున్న సిద్ద జమున కుటుంబాన్ని పరామ ర్శించారు. నీట మునిగిన కాలనీల్లో పర్యటిం చారు. కేసీఆర్‌ వైఫల్యం వల్లనే వరదలు ముంచెత్తా యని విమర్శించారు.
 
ముంపు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేలు సరిపోవని, కనీసం రూ.25 వేల చొప్పున చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. ముంపు బాధితుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున వైఎస్సార్ టీపీ తరపున అందజేస్తామని హామీ ఇచ్చారు.  

బాధితులకు సాయమేదీ? వరద బాధితులను ఆదుకోవటం లో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో  వరద తాకిడికి గురైన ఇందిరమ్మ కాలనీని సందర్శిం చారు. బాధితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు.