కారులో ఊపిరాడక... నలుగురు చిన్నారులు...
Published on: Wed Aug 13, 2014 6:19PM

తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. నలుగురు చిన్నారులు కారులో ఎక్కి డోర్లు మూసేశారు. మూసుకుపోయిన డోర్లు ఎలా తెరవాలో వారికి తెలియపోవడంతో కారులోనే ఇరుక్కుపోయారు. కారు డోర్ల అద్దాలు కూడా మూసి వుండటంతో నలుగురు చిన్నారులూ ఊపిరాడక మరణించారు. చిన్నారులు కనిపించకపోవడంతో వెతికిన తల్లిదండ్రులకు నలుగురు చిన్నారులూ విగతజీవులుగా కనిపిచండంతో వారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అత్యంత విషాదభరితమైన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తూతుక్కుడి జిల్లా వేదనత్తంలో జరిగింది.


