TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కారు డ్రైవర్ కుమారుడు తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్!

Published on: Wed May 13, 2026 8:56AM

తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన దళపతి విజయ్..  ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.  'తమిళగ వెట్రి కళగం' (టీవీకే ) పార్టీని స్థాపించిన నాటి నుండి వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న విజయ్..    తమిళనాడు ముఖ్యమంత్రిగా  సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శబరినాథన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించారు. ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య నియామకం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్  తన   కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్  టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయం ద్వారా సీఎం విజయ్ తన ప్రభుత్వం సామాన్యులకు, విధేయతకు పెద్దపీట వేస్తుందనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.  ఈ నియామకంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడికి ఉన్నత పదవి దక్కడం అభినందనీయమని కొందరు ప్రశంసిస్తుండగా, ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి  ప్రభుత్వ చీఫ్ విప్ వంటి  కీలకమైన పదవి కట్టబెట్టడం సరికాదనీ అంటున్నారు.