TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కారులో మంటలు.. నడిరోడ్డుపై దగ్ధమైన కారు

Published on: Sun May 10, 2026 8:08AM

హైదరాబాదులోని కొండాపూర్ లో నడుస్తున్న  కార్ లో నుండి ఒక్కసారిగా మంటలు చెడరేగాయి.   శనివారం (మే 9) రాత్రి సమయంలో ఓ  బెంజ్ కార్ గచ్చిబౌలి నుండి కొండాపూర్ వైపు వెళుతున్న సమయంలో కొత్తగూడెం సిటీ మాల్ సమీపంలో ఒక్కసారిగా  కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారు ను ఆపేసి బయటకు దిగి పరుగులు తీశాడు. దీంతో ప్రాణనష్టం తప్పింది. క్షణాల్లోనే  మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. నడిరోడ్డు మీద కారు మంటల్లో దగ్ధం అవుతుండడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  మంటల్లో కారు మొత్తం దగ్ధమైంది... సమాచారం అందుకున్న  పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.