ఇరాక్‌లో కారు బాంబు పేలుడు 13 మంది మృతి
Published on: Tue Sep 2, 2014 1:47PM
.jpg)
ఇరాక్ రాజధానిలో కారుబాంబులు పేలడం, చాలామంది అమాయక ప్రజలు చనిపోవడం మామూలు విషయంలా మారిపోయింది. అక్కడి వారికి ఇది మామూలుగానే వుండొచ్చుగానీ, ప్రపంచంలోని ఇతర దేశాల వారికి మాత్రం అది చాలా టెర్రర్ కలిగిస్తున్న అంశం. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ కారు బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈమధ్యకాలంలో ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన హింసాకాండలో 1420 మంది మరణించారు. 1370 మంది గాయపడ్డారు. ఇరాక్‌కి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది.


