TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమాన ప్రమాదంలో క్యాపిటల్ ఫ్యాక్టరీ సీఈవో జాషువా బేర్ దుర్మరణం!

Published on: Thu Jun 18, 2026 9:32AM

అమెరికాలోని జరిగిన ఘోర విమాన ప్రమాదంలో  ప్రముఖ టెక్ స్టార్టప్  క్యాపిటల్ ఫ్యాక్టరీ' సీఈవో జాషువా బేర్  దుర్మరణం పాలయ్యారు.  టెక్సాస్ రాష్ట్రం లారెడో నగరంలోని లూప్ 20 జాతీయ రహదారిపై  ఈ   దుర్ఘటన జరిగింది. మెక్సికో నుంచి టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరానికి ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఈ ప్రైవేట్ విమానంలో  సాంకేతిక లోపాలు తలెత్తాయి.   విమానంలో ఇంధనం కూడా పూర్తిగా అయిపోయి పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించేందుకు సిబ్బంది శతధా  ప్రయత్నించారు.

అయితే రన్‌వేకు  కొద్ది దూరంలో విమానం పూర్తిగా పైలట్ నియంత్రణ కోల్పోయింది. రెప్పపాటు కాలంలో లూప్ 20 రహదారిపైకి దూసుకొచ్చిన ఆ విమానం, అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను, రహదారిపై వెడుతున్న  ఒక రహదారి వాహనాన్ని  ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు   విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది.   పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.  ఈ ఘోర ప్రమాదంలో క్యాపిటల్ ఫ్యాక్టరీ అధినేత జాషువా బేర్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు  తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

విమానం మంటల్లో చిక్కుకుని ఎప్పుడైనా పేలిపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, అటుగా వెళ్తున్న   వాహనదారులు  ప్రాణాలకు తెగించి విమానంలో  చిక్కుకున్న ప్రయాణికును కాపాడారు.