TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుతిన్‌ను చూసి మోదీ నేర్చుకోవాలా?.. 'పీవోకే' స్వాధీనం చేసుకోవాలా?

Published on: Mon Feb 28, 2022 12:11PM

ఉక్రెయిన్’ ఫై రష్యా దాడి చేసింది. యుద్ధం సాగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షలు విధించినా, బెదిరించినా, హెచ్చరికలు చేస్తున్నా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ’ పుతిన్ వెనకడుగు వేయడం లేదు. యుద్ధం జరుగుతోంది. ఇరువైపులా ప్రాణనష్టం జరుగుతోంది. ప్రపంచ దేశాల మీద యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. మన దేశం అందుకు మినహాయింపు కాదు. నిజానికి, ఈ యుధం మనకో పాఠం. ఇరుగు పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును ఉపేక్షించడం ఎంత మాత్రం తగదని, మన దేశం ఏడు పదులకుపైగా సాగిస్తున్న దౌత్యనీతి లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్న హెచ్చరిక.    అందుకే,  ఉక్రెయిన్’ పై రష్యా సాగిస్తున్న యుద్ధం మన దేశానికి సంబంధించినంత వరకు మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. 

పాక్’ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సంగతేంటనే ప్రశ్నను తెర మీదకు తెస్తోంది. ఇంకొంత లోతుల్లోకి వెళ్లి అఖండ భారత్ దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. నిజానికి అఖండ భారత్’ అనేది ఒక విశాల దృశ్యం. పాకిస్థాన్- బంగ్లాదేశ్- బర్మా- టిబెట్- ఆఫ్గనిస్తాన్- శ్రీలంక- నేపాల్- భూటాన్ లను కలిపి.. అఖండ భారత్ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్’కు ముందున్న భారతదేశం ఇది. ఈ దేశాలు ఒక్కోటిగా భారత్ నుంచి విడిపోయాయి. కొన్ని, బ్రిటిష్ పాలన కాలంలో మన నుంచి విడిపోతే, పాకిస్థాన్. పాక్ నుంచి బంగ్లా దేశ్ ఆ తర్వాత విడిపోయాయి. ఇపుడు మనకు పక్కలో బల్లెం అయ్యాయి.  

అలాగే, రష్యా, ఉక్రెయిన్ దేశాలు కూడా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాలు. అయితే, ఇప్పుడు రష్యా, నాటో’ను బూచిగా చూపించి, దయాది దేశం పై యుద్దానికి దిగింది. ఒక విధంగా చూస్తే ఉక్రెయిన్ కి పాకిస్థాన్’ కి కూడా పోలికలు ఉన్నాయి. నిజానికి, రష్యా, ఉక్రెయిన్.. సోవియట్ యూనియన్ నుంచి సశాస్త్రీయంగా విడిపోయాయి. సర్వామోదంతో విడిపోయాయి. అయినా ఉక్రెయిన్ నాటో దేశాలతో కలుస్తాను అని అంటేనే తమ దేశానికి అది భవిష్యత్’లో ముప్పుగా పరిణమిస్తుందని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్’ ని జయించి తమ దేశంలో కలుపుకోవాలని చూస్తున్నాడు.

ఈ నేపధ్యంలో స్వాతంత్రానికి ముందు భారత్ నుంచి విడిపోయిన దేశాల సంగతి ఎలా ఉన్నా, స్వాతంత్రానికి, ’షరతు’ గా మత ప్రాతిపదిక ముక్కలైన భారతదేశం( భారత్ -పాక్)ల సంగతేంటి? పాక్’ను మన దేశం ఎందుకు అక్రమించుకోకూడదు? అనే చర్చ జరుగుతోంది. అలాగే,  మన దేశంపై దాయాది దేశం సాగిస్తున్న ఉగ్రదాడికి స్థావరంగా నిలిచిన పాక్ ఆక్రమిత కశ్మీర్’ను మన దేశంలో విలీనం చేసుకోవాలనే ఆలోచన దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. 

దేశ స్వాతంత్ర సంగ్రామం చివరి క్షణం వరకు ఒకటిగా ఉన్న, పాకిస్థాన్ని భారత్ ఎందుకు తిరిగి కలుపుకోకూడదు అన్న కొత్త చర్చ కూడా వస్తోంది. పాక్ సైతం భారత్’ ని ఇబ్బంది పెట్టడానికి సరిహద్దులలో చైనాకు చోటిస్తోంది. ఆ విధంగా భారత్’కి నిరంతర ముప్పు తెచ్చేలా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పుడు కొత్తగా పన్నే కుట్రలకు తోడు గడచిన ఏడు దశాబ్దాలలో పాకిస్థాన్ సాగిస్తున్న నిరంతర ప్రచ్చన్న యుద్దానికి మన దేశం ఎంతో మూల్యం చెల్లించింది.నిజానికి పాకిస్థాన్’ మన దేశంపై వెయ్యేళ్ళ యుద్ధం ప్రకటించింది. అయినా, మన దేశం చేతులు కట్టుకుని శాంతి మంత్రం జపిస్తోందనే విమర్శ ఒక వైపు, మన దేశం పాక ఆక్రమిత కశ్మీర్ చేసిన సర్జికల్ స్ట్రైక్’ ను ప్రశ్నించే గొంతులకలు మరొక వైపు వినిపిస్తున్నాయి. 

మరో వైపు  తమ  దేశానికి ముప్పు అన్న ఒకే ఒక సాకుతో ఉక్రెయిన్’ పై యుద్ధం చేస్తున్న రష్యా, చివరకు అణు యుద్ధానికి కూడా సిద్దమంటోంది. అంతే కాదు, ప్రపంచ దేశాలు పుతిన్’ ను తప్పు పడుతున్నా, తమ దేశం కోసం తాను చేస్తోంది రైటు అని పుతిన్ అంటున్నాడు. మరి మన దేశం సంగతేంటి, భవిష్యత్’లోనే కాదు, గతం నుంచి వర్తమానంలోనూ పక్కలో బల్లెంలా మారిన పాక్ పై మన దేశం యుద్ధం చేసి, పాక్ అక్రమిత కశ్మీర్’ ను స్వాధీనం చేసుకుంటే తప్పేంటి? దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అఖండ భారతాన్ని తిరిగి సాధించేందుకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్న ప్రశ్న వస్తోంది. నిజానికి, సంఘ్ పరివార్ సంస్థల  ఎజెండాలో మొదటి నుంచి కూడా అఖండ బారత్. ఉండనే ఉంది. ఇక ముందు మోడీ ప్రభుత్వం ఏమి చేస్తుందో, చూడవలసి వుంది. మోడీ ..పుతిన్ అదుగులో అడుగేస్తారా? అఖండ భారత్ సంగతి ఎలా ఉన్నా, పాక్ ఆక్రమిత కశ్మీర్’ ను అయినా స్వాధీనం చేసుకుంటారా? భారత మాత నుదుటన కశ్మీర్ సిందూరం అద్దుతారా? ఇవే ఇప్పుడు దేశంలో వినవస్తున్న ప్రశ్నలు, ఓకే విధంగా మెజారిటీ ప్రజల ఆకాంక్షలు.. చూడాలి ఏమి చేస్తారో మోడీ?