TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పకూలిన బంగారు గని.. వంద మందికి పైగా మృతి. !

Published on: Fri Aug 21, 2026 1:04PM

ఆఫ్రికా ఖండంలోఘోర విషాదం  చోటుచేసుకుంది. కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక  బంగారు గని  కుప్పకూలడంతో పెద్ద సంఖ్యలో   కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.  జంబోయే గ్రామం సమీపంలో  ఈ దుర్ఘటన జరిగింది. లోతుగా ఉన్న గనిలో పనులు నిర్వహిస్తున్న సమయంలో పైన ఉన్న భారీ మట్టి దిబ్బలు ఒక్కసారిగా విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.  

 సహాయక బృందాలు,  భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. కొందరు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మృతుల సంఖ్య వంద దాటినట్లు తెలుస్తున్నది.  ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  

Cameroon mine accident, Central African Republic gold mine, Jamboye gold mine collapse, Africa mining accident, over100died