కాల్ మనీ.. లొంగిపోయిన సత్యానందం
Published on: Thu Dec 31, 2015 2:06PM

కాల్ మనీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న డీఈ సత్యానందం లొంగిపోయాడు. ఈరోజు ఉదయం విజయవాడలోని న్యాయస్థానం ముందు సత్యానందం లొంగిపోయాడు. అయితే సత్యానందంకు ఇటీవలే ముందుస్తు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. రూ. లక్ష రూపాయల పూచికత్తుతో కోర్టు సత్యానందంకు బెయిల్ మంజూరు చేశారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాచవరం పీఎస్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్, భవానీ శంకర్ అరెస్టయి జైలులో ఉన్నారు. చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్ పరారీలో ఉన్నారు.
కాగా ఈ కాల్ మనీ వ్యవహారంపై హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 250 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


