TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టు జ‌డ్జికి సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్..

Published on: Fri Mar 10, 2017 10:53AM


కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి సీఎస్ క‌ర్ణ‌న్‌కు బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఉల్లంఘ‌న కేసులో సుప్రీంకోర్టు ముందు హాజ‌రుకాని నేపథ్యంలో బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 31న కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని కోల్‌క‌తా పోలీస్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా త‌న భ‌ర్త‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డంతోపాటు తమ కుటుంబాన్ని క‌ర్ణ‌న్ వేధిస్తున్నార‌ని మ‌ద్రాస్ హైకోర్ట్ జ‌డ్జి భార్య ఒక‌రు దాఖ‌లు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీం ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపుతున్న‌ది. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఓ హైకోర్టు జడ్జికి కోర్టు ఉల్లంఘ‌న నోటీసులు జారీ అయ్యాయి. అయితే క‌ర్ణ‌న్ మాత్రం కోర్టు ముందు హాజ‌రు కాలేదు.