వందేళ్ల నాటి కేక్... ఇంకా ఫ్రెష్ గా...

 

సాధారణంగా కేకులు ఎన్ని రోజులు ఉంటాయి.. ఫ్రిజ్ లో పెట్టి ఉంచితే ఏదో కొద్ది రోజులు ఉంటాయి.. ఇక బయట ఉంటే అంతే సంగతి.. ఒక్కరోజు కూడా సరిగా ఉండదు. అలాంటిది.. ఒక కేకు వందేళ్లైన పాడవకుండా ఉందంటే షాకింగే కదా.. ఇంతకీ ఆ కేసు ఎక్కడ ఉందనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...అంటార్కిటికా ప్రాంతంలో మంచులో కూరుకుపోయిన ఓ కేకును పరిశోధకులు గుర్తించారు. ఎవరో ఇటీవల ఇక్కడ పడేసి ఉంటారని అనుకున్నారు. కానీ దానిపై పరిశోధనలు చేపట్టగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఆ కేకు దాదాపు వంద ఏళ్లనాటిదని... 1910-1913 మధ్య కాలానికి చెంది ఉంటుందని తేలింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అది ఇప్పటికీ ఎంతో తాజాగా ఉంది. అంటార్కిటికాలోని కేప్‌ అడేర్‌ ప్రాంతంలో ఓ పెట్టెలో పండ్లతో తయారు చేసిన ఓ కేకు లభించింది. పెట్టె చెడిపోయిన దశలో ఉన్నప్పటికీ కేక్‌ మాత్రం తాజాగా ఉన్నట్లు గుర్తించారు. అది తినడానికి పనికి వస్తుందని దానిపై పరిశోధనలు చేపట్టిన అంటార్కిటికా హెరిటేజ్‌ ట్రస్ట్‌ బృందం తెలిపింది. అక్కడ ఉండే అత్యంత శీతల వాతావరణమే ఇది చెడిపోకుండా ఉండటానికి కారణమని పేర్కొన్నారు.