Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంతా జగన్నాటకం!
posted on: Jun 21, 2022 12:40PM
అమ్మ ఇచ్చిన రూపాయి కాసుతో బడికే వెళ్లి ఆనక ఆటకి వెళ్ల చ్చు. కానీ పిల్లచేష్టలకు అంతుంటుందా? ఎవడు అడుగుతాడులే అని రూపాయికీ తప్పుడు లెక్క చెబితే ఎలా? ఇక్కడే చిక్కొచ్చేది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కాగ్ కి వచ్చిన తల భారమూ ఇలాంటిదే.
ప్రభుత్వం ప్రజా రంజకంగా పాలించాలి. అందుకు అనేక మంచి సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయాలి. అలా చేస్తున్నామని, మా పాలన బ్రహ్మాండంగా సాగుతోందని భారీ ప్రచారం చేయించుకోవడంలో జగన్ ప్రభుత్వం అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతోంది. కాగ్‌కి ఇస్తున్న లెక్కల గురించి ఏకంగా చర్చే నడుస్తోంది. అంతా కాకి లెక్కలని తేలింది. చిన్న ఉదాహరణ..ఫిబ్రవరి వరకు రాష్ట్రం సబ్సి డీల కోసం రూ.17,234 కోట్లు ఖర్చు చేసినట్లు ముందుగా కాగ్‌కు నివేదిక ఇచ్చింది.
తర్వాత మార్చి వచ్చేసరికి ఈ మొత్తం రూ.14,681 కోట్లకు తగ్గిపో యింది. అంటే ఖర్చు పెట్టేసిన తర్వాత తగ్గిపోయిందన్నమాట. అదెలా సాధ్యమవుతుందని ప్రతీవారూ సందేహిస్తున్నారు, కేంద్రం తప్ప! అంతా తప్పుల తడకల లెక్కలేనని ఇక్కడే తెలుస్తోంది.
ఫిబ్రవరి నెలలో కేవలం రూ.417 కోట్లు మాత్రమే రెవెన్యూ వ్యయ పద్దులో చూపించారు. జీతాలు, పెన్షన్లు మొత్తం రెవిన్యూ వ్యయం అవుతాయి. అంటే.. ఆ కొద్ది మొత్తమే జీతాలుగా ఇచ్చారా ? మిగతా మొత్తం ఇవ్వలేదా ? ఇచ్చినా లెక్కల్లో ఎందుకు చూపించడం లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వానికే ఎరుక. అసలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు ఏపీ ఎలాంటి వివరాలను సమర్పించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
అన్ని రాష్ట్రాలవారూ అన్ని వివరాలు అందించారు గాని ఆంధ్రప్రదేశ్ నుంచీ ఎలాంటి వివరణా లేదు. వివరాలతో పాటు రుణాల చెల్లింపులు, వడ్డీ వివరాలు, అప్పు ఇంకా ఎంత వుంది అనే అంశాల వివరాలు ఇవ్వాలి. వాటి వూసే లేదు. కానీ కాగ్ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చేసింది. అంటే ఆడి టింగ్ సరిగా చేయడంలేదని, కేంద్రం పట్టించుకోవడం లేదన్న సంగతి స్పష్టమవుతోంది. జగన్ ప్రభుత్వం ఇచ్చినవన్నీ తప్పుడు లెక్కలని అందరికీ తెలిసినా కేంద్రం మాత్రం దీన్ని గురించి ప్రత్యేక దృష్టి సారించడం లేదు. మరి ఈ సహాయ సహకారాల రహస్యమేమిటో కేంద్రంలో వున్నవారే తెలియ జేస్తే అమాయక ప్రజలకు అవగతమవుతుంది.



.webp)


