TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుజ‌రాత్‌లో కూలిన కేబుల్ బ్రిడ్జ్‌..32 మంది మృతి

Published on: Sun Oct 30, 2022 9:36PM

సాయంత్రం స‌ర‌దాగా గ‌డిపేం దు కు కేబుల్ బ్రిడ్జ్ మీద‌కు వెళ్లి గ‌డ‌ ప‌డం ఎవ‌రిక‌యినా ఇష్ట‌మే. కానీ ఈ ఆదివారం ఇలా ఘోర ప్ర‌మాదం సంభ‌విస్తుంద‌ని ఎవ్వ‌ రూ ఊహించ‌ లేదు. గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ నదిపై కేబిల్ బ్రిడ్జీ కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమా దంలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమ యంలో బ్రిడ్జిపై ఉన్న సందర్శ కులంతా నదిలో పడి పోయారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మందివరకు ఉన్నారని, వంద‌మంది వరకు నీటిలో చిక్కుకున్నారని తెలుస్తోంది.  

స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. కాగా కొన్నేళ్లక్రితమే ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇటివలే పున రుద్ధరణ తర్వాత ఐదురోజుల క్రితమే ఈ బ్రిడ్జీని పున:ప్రారంభించారు. నదిలో పడిపోయినవారి కోసం స్థానికుల సాయంతో అధికారులు గాలిస్తున్నారు. గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వీ, ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ ఘటనా స్థలానికి బయలు దేరారు. రెండు బృందాల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ హూటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరాయి.

మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.