బైరెడ్డి చూపు కాంగ్రెస్ వైపేనా?

తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బైరెడ్డి.ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాయలసీమ హక్కులపై పోరాటం ప్రారంభించి రాయలసీమ పోరాట సమితిని ఏర్పాటు చేసారు.రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ సీమ జిల్లాల్లో యాత్రలు, సమావేశాలు, సభలు నిర్వహించినా పెద్దగా  కలిసిరాలేదు.అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు.

 

 

ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దాంతో బైరెడ్డి టీడీపీలో చేరతారనే వార్తలు జోరందుకున్నా ఆయన మాత్రం తన నిర్ణయం తెలుపలేదు. బైరెడ్డి కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీతో భేటీ అవ్వటం జరిగింది. అంతేకాక ఈ మధ్యే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంప్రదింపులతో బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని,ఈ నెల 22న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.