TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా ఓటర్లకు ముక్కెరలు, చీరలతో ఎర ?

Published on: Thu Jun 7, 2012 4:04PM

ఉప ఎన్నికల్లో నోటుకు వేసే రోజులు పోయాయి. అందుకే మగువ అందాన్ని పెంచే ముక్కెరతో ఓటు వేయించుకోవాలని ఒంగోలు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మొత్తం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ఐదువేల 43మంది ఓటర్లున్నారు. వీరిలో 98వేల ముగ్గురు పురుష ఓటర్లు. లక్షా 2వేల 511మంది మహిళలున్నారు. సుమారు నాలుగువేల మంది మహిళలు ఆధిక్యంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తీర్పు వారి ఆలోచనలకు అనుగుణంగానే వెలువడుతుంది. అందుకే అభ్యర్థులు మహిళలకు ముచ్చటైన ముక్కెర,  చెవికమ్మలు పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో బంగారం పనివారికి చేతినిండా పని తగులుతోంది. అలానే హోల్ సేల్ గా బంగారం అమ్మే వర్తకులను అభ్యర్థులు మచ్చిక చేసుకుంటున్నారు. తక్కువ ఖరీదులో అద్భుతమైన డిజైన్లను అందించాలని అభ్యర్థులు బంగారు పని వారలను కోరుతున్నారు. చేవికమ్మల్లో లేటెస్ట్ డిజైన్ లను తెప్పించుకుని అభ్యర్థులు తమ ఇంట్లో ఇతర ఆడవారి సాయంతో ఎంపిక చేస్తున్నారు. చెవికమ్మలు,ముక్కెర భరించలేమనుకున్న ఓ అభ్యర్థి సుమారు 75వేల చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా పోటాపోటీగా నియోజకవర్గం ప్రచారంతో పాటు ప్రలోభాల్లోనూ మంచి పేరు గడించింది. ఇక్కడి తెలగుదేశం కార్యాలయంలో లెక్కల్లో చూపని రూ. 14లక్షలు దొరికాయి. ఒక గోదాములో 686 మద్యం (ఓటి) కేసులు దొరికాయి. అలానే ఆటోల్లో గోతాల్లో తరలిస్తున్న మద్యం కూడా ఎక్సయిజ్ శాఖ స్వాధీనం చేసుకుంది.