TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపఎన్నికలు తెలంగాణ ఉద్యమంలో భాగమే

Published on: Sat Dec 17, 2011 12:56PM

మహబూబ్‌నగర్: తెలంగాణ విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డివి దొంగమాటలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా గోరిటలో ఆయన శనివారం తెలంగాణ అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందని కొంత మంది అపోహ పడుతున్నారని, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమేనని, తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాయకులకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెసును లక్ష్యంగా చేసుకుని తాము ఉద్యమాన్ని సాగిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెసు కుట్ర వల్లనే తెలంగాణపై చర్చ చేయకుండా రాజ్యసభ వాయిదా పడే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.