ఉపఎన్నికలు..అభ్యర్ధులు వీరే!
Published on: Tue Feb 21, 2012 1:33PM
హైదరా
బాద్: కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోటీకి దించాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లా స్షేషన్ ఘనపూర్ నుంచి ఆర్. ప్రతాప్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడానికి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బసవరాజు సారయ్య, పార్లమెంటు సభ్యుడు రాజయ్య, తదితరులు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి రామచంద్రా రెడ్డిని పోటీకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. కొల్లాపూర్ స్థానం అభ్యర్థి ఖరారు విషయం ఇంకా కొలిక్కి రానట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు అభ్యర్థిగా దామోదర్ రెడ్డి పేరు ఖరారైంది. నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి పేరు ఖరారైంది. మహబూబ్‌నగర్ స్థానం నుంచి దివంగత శాసనసభ్యుడు విజయలక్ష్మిని పోటీ దించాలనే నిర్ణయానికే కట్టుబడినట్లు తెలుస్తోంది.


