TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉపఎన్నికల్లో పోటీకి బాలయ్య సై..తెలంగాణలో పర్యటన

Published on: Thu Jan 26, 2012 10:05AM

హైదరాబాద్: పార్టీ ఆదేశిస్తే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.