ఉపఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దే టీజీ
Published on: Wed Jan 4, 2012 11:39AM
హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ రాష్ట్రంలో ప్రశాంతత కలిపించేందుకు కృషి చేస్తున్నారని టీజీ పేర్కొన్నారు. అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రాజెక్టుల పూర్తి, గతంలో సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై సీఎం దృష్టి పెట్టారన్నారు. రబ్బరు బుల్లెట్ ప్రయోగించకుండా ఉద్యమాలను అణిచివేశారని తెలిపారు. ప్రభుత్వ పని తీరుపై ఓట్లు వేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.


