TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీని తాకిన ఆంద్ర ఉప ఎన్నికల వేడి

Published on: Thu May 24, 2012 11:08AM

రాష్ట్రంలోని ఉప ఎన్నికలతో ఢిల్లీ వేడెక్కింది. ఇక్కడ జరుగు తున్న ప్రచారాలు, ఫలితాలెలా ఉన్నాయో అన్న సమీక్షలు, సర్వేలు జాతీయనాయకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రమే దీనిపై దృష్టి పెట్టిందని అందరూ భావించారు. తీరా పరిస్థితి పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఒకవైపు, మరోవైపు సమాజ్ వాదీపార్టీ, ఇంకోవైపు బిజెపి కూడా ఈ ఉప ఎన్నికల ఊసులతో కాలక్షేపం చేస్తున్నాయి. ఆ పార్టీల నేతలు తమకు అనుబంధంగా రాష్ట్రంలో ఉన్న నేతల ఇళ్ళకు, సెల్ ఫోన్లకు ఫోన్లు చేసి 'కైసే చల్తారే ... ఇస్ బార్ కౌన్ జీతేగా ... (ఎన్నికలెలా జరుగుతాయి, ఈసారి ఎవరు నెగ్గుతారు) వంటి ప్రశ్నలతో పలకరిస్తున్నారు.

 

 

దీంతో తమకు తెలిసిన సమాచారం అంతా చెప్పేసి సాయంత్రం తామే ఫోను చేస్తామని ఆ నేతలకు భరోసా ఇచ్చేసి రాష్ట్రనాయకులు నియోజకవర్గాలకు వచ్చేస్తున్నారు. స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తరువాత పరిస్థితిని తమ అంచనాలను జోడించి చెబుతున్నారు. బిజెపి నాయకులైతే వెంకయ్యనాయుడు ద్వారా ఈ ఎన్నికల్లో చేయాల్సిన ప్రచారం గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

 

 

ప్రత్యేకించి బిజెపి పరకాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఇక్కడి నుంచి డాక్టరు విజయ్ చందర్ ను అభ్యర్థిగా నిలిపింది. ఇక్కడ గెలుపుకోసం కేంద్రమాజీమంత్రి బండారు దత్తాత్రేయను, వెంకయ్యనాయుడును, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బాధ్యులుగా ప్రకటించింది. దీనికి తోడు ప్రచారం కోసం సుష్మాస్వరాజ్ ను ఇక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలానే సిపిఎం నుంచి సీతారామ్ ఏచూరి కూడా ప్రచారంలో పాల్గొనేందుకు రావచ్చని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ తిరుపతి, అననతపురం జిల్లాలో పార్టీ పోటీలో ఉంది కాబట్టి అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన రావచ్చని భావిస్తున్నారు. ఇక ఢిల్లీ లోని కాంగ్రెస్ భవన్ నేతలతో కళకళలాడుతోంది.

 

 

 

రాష్ట్రంలో పర్యటిస్తున్న ఎఐసిసి పరిశీలకుడు, రాష్ట్ర ఉప ఎన్నికల ఇన్ ఛార్జి వాయలార్ రవి సమీక్షలను కథలు కథలుగా పార్టీ కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు కెబి కృష్ణమూర్తి కూడా ఢిల్లీ వెళ్ళి నేతలకు తన నివేదికను సమర్పించారు. దీని గురించి కూడా ఇతర రాష్ట్రాల నేతలు ఆసక్తి చూపుతున్నారు. అన్ని పార్టీల జాతీయ నేతలు మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు అవుతారా? లేదా? సర్వేల ప్రకారం జగన్ గ్లుస్తాడా? అన్న అంశాలపై చర్చిస్తున్నారు. గతంలో అన్నాహజారే దీక్ష గురించి చర్చించనినట్టే ప్రతీపార్టీ కార్యాలయంలోనూ జగన్ అంశంపై నేతలు విభేదిస్తున్నారు. ఒక్కూక్కరూ విభిన్న సమాధానాలతో నేతలు చర్చకు వేదికలను రూపొందిస్తున్నారు , ఏదేమైనా దేశారాజదానిని రాష్ట్ర ఎన్నికల వేడి తాకింది. అన్ని కార్యాలయాల్లో టీవీలకు పనిపెట్టారు. వచ్చే ప్రతివార్తనూ పరిశీలించటం, సమీక్షించటం ప్రధానకేంద్రాల పనిలా కనిపిస్తోంది.