చివరి వరకు జగన్‌తోనే: ఎంపీ బుట్టా రేణుక

తాను తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక. హోళగుందలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని..ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఎదురుచూస్తున్నారని..అలాంటి పార్టీని వదిలి తాను టీడీపీలోకి చేరే ప్రసక్తి లేదని రేణుక స్పష్టం చేశారు.