ఒడిశాలో బస్సు ప్రమాదం... ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం
Published on: Sat Jul 13, 2024 12:30PM
పూరి జగన్నాథ రథ యాత్రకు వెళ్లి తిరిగొస్తున్న తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఒడిశాకు యాత్రికులతో బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తిరిగి వస్తుండగా ఒడిశాలో ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టు తెలిసింది. వీరంతా హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకకు చెందిన వారని సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? క్షతగాత్రులు ఎక్కడ చికిత్స పొందుతున్నారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.


