నదిలో పడిన బస్సు... 35 మంది మృతి
Published on: Thu Sep 4, 2014 2:48PM

జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఒక బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి వుంది. పదిహేను రోజుల క్రితమే హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఆగస్టు 21వ తేదీన ఒక మినీ బస్ రోడ్డు మీద వెళ్తూ అదుపు తప్పి బిస్పా నదిలోకి దూసుకెళ్ళింది. ఆ ప్రమాదంలో 16 మంది మరణించడగా, 26 మంది గాయపడ్డారు.


