మహిళ తలలోంచి బుల్లెట్....
Published on: Thu Aug 21, 2014 11:47AM

పోలీసు శిక్షణ సందర్భంగా చేసిన ఫైరింగ్ ఒక మహిళా రైతు ప్రాణాల మీదకి తెచ్చింది. మెదక్ జిల్లా శివ్వంపేట సమీపంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీహెచ్‌ఇఎల్ ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు రైఫిల్ షూటింగ్ శిక్షణ జరుగుతోంది. అయితే ఈవిషయం తెలియక అటువైపుగా వెళ్ళిన చంద్రకళ (48) అనే మహిళా రైతు తలలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. దాంతో చంద్రకళను సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తలలోని బుల్లెట్‌ని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.


