జగనన్నకు బుగ్గన దెబ్బ.. నరం లేని నాలుక కదా?!
Published on: Fri Jun 3, 2022 6:40PM
పూర్వం గురుదక్షిణగా పండు తాంబూలం గురువుగారికి శిష్యుడు ఇచ్చుకునేవాడు. గెలిచిన పతకంతో తన గురువుకు తిరిగి చిన్నపాటి సన్మానం చేయడం క్రీడాకారుడి పని. ఏలికవారిని ప్రసన్నం చేసుకోవడా నికి పూలగుత్తితో పాటు చిత్రపటాలు ఇవ్వడం రాజకీయనాయకు లకు పరిపాటి. ఎంతైనా నాడు చంద్రబాబు చేసింది తప్పైనప్పుడు ఇప్పుడు జగన్ చేస్తున్నది రైటౌతుందా? శాలువాల లెక్కలు చెప్పమనడం సమంజసమేనా. ఇంతవరకూ బాగానే వుంది. కానీ ఒకసారి తప్పు అయినది మరోసారి ఒప్పు ఎలాగవుతుందో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన గారు సెలవియ్యాలి.
అవును. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసినవన్నీ రాబట్టుకోవడానికి ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తూనే వున్నారు. ఎప్పడు వెళ్లి వచ్చినా వివరాలు గోప్యం గానే వుంచు తున్నారు సరే. ఇక్కడ మరో ముచ్చట తమ నాయకుడు మొన్న ఢిల్లీ వచ్చిన వివ రాలు ఏవీ చెప్పలేదని ప్రజలు, ప్రతిపక్షాలు ఆ్రగహిస్తున్నాయని తేటతెల్లమయింది. తమ నాయకుని వైఫల్యంతో తెగ మధనపడుతుండ వచ్చు గాక. కానీ నాడు బాబు దుస్సాలువలు కప్పడం, తిరుమల లడ్డు ఇవ్వడాన్ని తప్పుపట్టిన బుగ్గన ఇప్పుడెందుకు జగన్ అదే పని చేస్తే మాట్లాడటంలేదు.
తమ నాయకుడు ఏం చేసినా రైటేనని ఆయన భావిస్తున్నారా?ఢిల్లీకి ప్రధాని దర్శనానికి వెళ్లిన నాయకులంతా తిరుమలేశుని ప్రతిమలు, మంచి డిజైన్ శాలువలు పట్టుకెళ్లడం, వాటిని అందించి వారిని ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగానే వస్తోంది. ఇందులో ఏముందని అనుకోవద్దు. ఇక్కడే అసలు గొడవ. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ప్రధానిని కలిసినపుడల్లా వెంకటేశుని ప్రతిమ, దుశ్శాలువ తీసుకెళ్లేవారు. అప్పుడంతా నచ్చని బుగ్గనకు ఇప్పడు జగన్ పర్యటనల్లో అదే చేస్తుంటే ఎలా నచ్చుతోంది.
మతి మరుపునకు కొంత పరిమితి అంటూ వుండాలి! బుగ్గన మతిమరుపునకు పరాకాష్ట ఆయన అప్పటి నోటి దూలే సాక్ష్యం. ప్రధాని కార్యాలయంలో శాలువలు గుట్టగా పేరుకుపోయాయి. వారిని అలా శాంత పర్చడం తప్ప రాష్ట్రానికి చేసుకొచ్చిందేమీ లేదన్నారు. జగన్ రెడ్డి నిజానికి ఢిల్లీ అనేక పర్యాయాలు వెళ్లి వస్తున్నారు. చంద్రబాబు కంటే ఈయన ప్రయాణాల సంఖ్యా, ఖర్చూ ఎక్కువ అనేది అందరికీ తెలిసిన సంగతి. వెళ్లినపుడల్లా జగన్ చంద్రబాబు పాటించిన సంప్రదాయాన్నే అనుసరిస్తున్నారుగదా!
ఇపుడు తప్పు కాలేదా? లేక జగన్మాయలో పడి బుగ్గనకు కనపడటం లేదా? అప్పటి ముఖ్యమంత్రి పర్యటనలపై ఎన్నిసార్లు వెళ్లినా వొట్టి చేతులతో తిరిగి వచ్చారని కామెంట్లు చేసినవారంతా మరి ఇపుడు జగన్ ఢిల్లీ ప్రయాణాల ప్రయోజనం గురించి నోరెత్తరేమి?పరిస్థితులు, కాలంతో పాటు అన్నీ మర్చిపోతానంటే ఎలా? బుగ్గనకు గుర్తులేకున్నా ప్రజలకు బాగా గుర్తుంది. ఒకప్పుడు తప్పన్నది ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుందో బుగ్గనవారే సెలవియ్యాలి.


