మనదేశం ఆర్థికంగా దూసుకెళ్తోంది



కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతర ప్రసంగంలో కొన్ని విశేషాలు..

* 14వ ఆర్థిక సంఘం అమలుతో రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి లభించింది. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోంది.

* ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో కేంద్రం ప్రత్యేక కృషి చేస్తోంది.

*  ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాలు సమ భాగస్వామ్యం కలిగి వుండాలని కోరుకుంటున్నాం. తొమ్మిది నెలలుగా ఆర్థిక అభివృద్ధి  కోసం ఎంతో కృషి చేశాం. మా ప్రభుత్వ కృషితో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి దిగి వచ్చింది.

* ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద దేశంలో కోట్లాదిమంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. స్వచ్ఛ భారత్ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయంగా ఆసక్తి కనిపిస్తోంది.