బడ్జెట్: కాకినాడలో హార్డ్‌వేర్ పార్క్!
Published on: Thu Jul 10, 2014 1:20PM

కేంద్ర బడ్జెట్‌లో కాకినాడకు గొప్ప అవకాశం ఇచ్చారు. లోక్ సభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాకినాడకు వరాలు ప్రకటించారు. కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీయిచ్చారు. అలాగే కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులిస్తామన్నారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో 20 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రకటించారు.


