TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త బడ్జెట్ - పాత అప్పులు.. జ‌గ‌న‌న్నకు లెక్క‌ల చిక్కులు...

Published on: Mon Jan 17, 2022 1:29PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత  మంచింది. నిజానికి, ముఖ్యమంత్రి జగన్మహాన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నా టి నుంచి, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది. అందుకే, జగన్ రెడ్డి రెండున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పు .. ఇంతింతై అన్నట్లుగా పెరిగి, ఇక అప్పులు పుట్టే ఛాన్స్ కూడా లేని దుస్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ   చేరుకుంది. ఓకే ఆ చేత్తో అప్పులు చేయడం మరో చేత్తో పందారం చేయడమే కానీ, ఆదాయ మార్గాల గురించి, ముఖ్యమంత్రికి కనీస అవగాహన కూడా లేక పోవడం వల్లనే పరిస్థితి ఈ స్థాయికి చేరిందాని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉంటే .. ఇప్పుడు   కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 2022-23 ఏడాదికి వివిధ శాఖల నుంచి అంచనాలు సేకరించి, అందుకు అనుగుణంగా  వచ్చే ఏడాదికి  శాఖల వారీగా బడ్జెట్  కేటాయింపుల నిర్ణయం జరుగుతుంది. 
అయితే, వచ్చే ఆర్థిక సంత్సరం బడ్జెట్ ఎలా ఉంటుంది, అనేది  ఒక విషయం అయితే, ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు ఖర్చు ఎంత చక్కగా సాగింది ..  బడ్జెట్ ఆంచనాలను ఈమేరకు చేరుకున్నాం అనేది అంచనావేసుకొవా లని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

ఆ కోణంలో చూసినప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పూర్తిగా విఫ్లమైందనే ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లషకులు భావిస్తున్నారు. నిజానికి,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, విద్య, వైద్యం. సాగు నీరు, తాగు నీరు ..వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు కేటాయింపులు ఘనంగానే జరిగాయి. కానీ, ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు.   నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వ శాఖలో బిల్లులు పెండింగులో ఉండటం వంటి సవాళ్ల మధ్య పనులు ముందుకు సాగలేదు. పనులు చేసేందుకు, సరకులు సరఫరా చేసేందుకూ గుత్తేదారులు, సరఫరాదారులు వెనకడుగు వేస్తున్నారు.

ఈ నేపధ్యంలో బడ్జెట్ కసరత్తు ఆర్థిక శాఖ  అధికారులకు కత్తిమీద సామే అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్'లో సింహ భాగం చేసిన అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులకు పోతుంది. ఇక మిగిలిన దాంట్లో ఉద్యోగుల జీత భత్యాలు, సంక్షేమ పందారాలకే సరిపోదు. కాబట్టి  పాత  అప్పులు వేటాడుతున్న నేపథ్యం గా ఆర్ధిక మంత్రి బుగ్గన  మండుతున్న  కొత్త బడ్జెట్'ను  ..  పాత వాసనలు వదలవని అంటున్నారు.