పన్ను బాదుడుకే బడ్జెట్: చంద్రబాబు
Published on: Sat Feb 18, 2012 9:16AM
హైదరా
బాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పన్నులు విధించారని బడ్జెట్పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆదాయానికి రెట్టింపు పన్నులు విధించారని ఆరోపించారు. జలయజ్ఞానికి బడ్జెట్లో కేటాయింపులు చూపుతున్నారు. కానీ ఖర్చు చేయడం లేదని అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో మనరాష్ట్రంలో పదో స్థానంలో ఉందని అన్నారు. రూ. 1.10 లక్షల కోట్లకు అప్పులు పెంచారని, విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని బాబు విమర్శించారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసం కాకుండా, ప్రజల మీద పన్నులు వేయడానికే తయారు చేశారని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడేలా ఈ బడ్జెట్ రూపొందించలేదని జూలకంటి దుయ్యబట్టారు. రాష్ట్రానికి దశ- దిశ నిర్దేశించేలా ఉండాల్సిన బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు తయారుచేశారని జూలకంటి ఆరోపించారు.


