రైల్వే బడ్జెట్ పై రాష్ట్ర ఎంపీల్లో చిగురించని ఆశలు
Published on: Fri Feb 10, 2012 4:15PM
హై
దరాబాద్: ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నా... బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం.. దక్షిణ మధ్య రైల్వేకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏడాదిలో మూడు కొత్తలైన్లు... ఆరు సర్వే లైన్లు వస్తున్నా అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. 20ఏళ్లక్రితం అనుమతి పొందిన ప్రాజెక్టులు సైతం ఇంతవరకు పూర్తికాలేదు. దీంతో కనీసం ఈ ఏడాదైనా వచ్చే బడ్జెట్‌లో సౌత్‌సెంట్రల్‌రైల్వే దిశమారుతుందేమో ఎదురుచూడాల్సిందే. దక్షిణ మధ్య రైల్వే కి ఆదాయం ఘనంగా వస్తున్నా నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. గత రైల్వే బడ్జెట్‌లో అమలుకు నోచుకోని కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, విద్యూదీకరణ, డబ్లింగ్ పనులు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం కిరణ్ ఏర్పాటు చేసిన సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. దేశంలో ఉన్న 16 జోన్లలో ఇండియన్ రైల్వేస్‌కి అత్యదిక ఆదాయాన్ని సమకూర్చుతున్న రైల్వేస్‌లో దక్షిణ మధ్య జోన్ నాల్గొది..దాదాపు ప్రతిఏడాది 300మిలియన్ల జనాభా సౌత్ సెంట్రల్ నుంచి వివిధ ప్రాంతాలకు పయనిస్తుంటారు. అయితే ఇంత ప్రజాదరణ ఉన్న దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం ప్రతిసారి సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రతి ఏడాది కేటాయించిన బడ్టెట్‌లో కేవలం 5నుంచి 10శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ అరకొర వసతులకే పరిమితం అవుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే మంత్రులు వారి జోన్‌లకే సింహభాగం బడ్జెట్‌ను తీసుకెళ్తుండటంతో సౌత్ సెంట్రల్ పరిస్థితి అధ్వాన్వంగా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని రాష్ట ఎంపీలు సైతం మండిపడుతున్నారు.


