TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజస్థాన్ రిజల్టే రిపీటవుతుంది..?

Published on: Fri Feb 2, 2018 5:11PM

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నితంగా తన మిత్రపక్ష వైఖరిని నిరసించారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి సాగరని వస్తున్న ఊహాగానాలకు ఏమాత్రం బలాన్ని ఇవ్వకుండా.. వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్ కాబట్టి.. గత ఎన్నికల్లో అది భూస్ధాపితం అయ్యిందని.. తెలంగాణలో కేసీఆర్‌ను.. ఏపీలో జగన్‌ను నమ్మి.. తరతరాలుగా అండగా నిలుస్తూ వస్తోన్న ప్రజలను నట్టేటముంచినందుకు కాంగ్రెస్ తగిన మూల్యాన్ని చెల్లించుకుందని సీఎం గుర్తు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగమని నమ్మి 2014  ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని.. రాష్ట్రానికి.. రాష్ట్ర ప్రజలకు గడచిన నాలుగు సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని.. తాజా బడ్జెట్‌ కూడా చాలా దారుణంగా ఉందన్నారు..

 

కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లకు బాగానే కేటాయింపులు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్ప చూపు ప్రదర్శించడం ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసలు ఏమీ చేయకుండానే అన్నీ చేశామనే భావనలో వారున్నారని.. తన దృష్టికి వచ్చిందన్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. ఒకటి మాత్రం నిజం పరిపాలన బాగోలేకపోతే ప్రజలు ఉపేక్షించరు అనడానికి తాజాగా ముగిసిన రాజస్థాన్ ఉప ఎన్నికలే నిదర్శనమని సీఎం హెచ్చరించారు.