TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్లో... బ్యాంకులకు చేయూత!

Published on: Mon Feb 29, 2016 11:33AM

 

మొండి బకాయిలతో మోడువారిపోతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ఆర్థికమంత్రి ఏదో ఒకటి చేస్తారన్న ఆశలు మొదటి నుంచీ ఉన్నవే. ఆశించినంత కాకపోయినా అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్లో వీటికి కొంత ప్రాముఖ్యతను కల్పించారు.

 

- రిజర్వ్ బ్యాంకు చట్టానికి తగు సవరణ చేయడం ద్వారా ద్రవ్య నీతిని తరచూ సమీక్షించేందుకు ఒక సంఘాన్ని నియమించనున్నారు.

 

- ప్రభుత్వ రంగం బ్యాంకులలో పేరుకుపోతున్నమొండి బకాయిలను గుర్తించి, వాటికి హామీగా ఉన్న ఆస్తులను కొన్ని ప్రత్యేక సంస్థలను అమ్ముకునే సదుపాయం ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కల్పించింది. ఇలా మొండి బకాయిలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకుల నుంచి ఖరీదు చేసి, వాటిని లాభసాటిగా మార్చుకునే సంస్థలను ‘Asset Reconstruction Companies’ అంటారు. మున్ముందు ఇలాంటి సంస్థలను మరింతగా ప్రోత్సహించనున్నట్లు అరుణ్‌ జైట్లీ తెలియచేశారు.

 

- ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడిలో సాయం చేసేందుకు 25,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

 

- ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బీమా సంస్థలు ఇకమీదట స్టాక్‌ ఎక్స్చేంజిలలో తమ షేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.