TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయి వెన్నుపోటు కామెంట్ల పై బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్

Published on: Thu Aug 27, 2020 6:10PM

కరోనా నుండి కోలుకున్న తరువాత విజయ సాయిరెడ్డి మరింత రెచ్చిపోయి చంద్రబాబు పైన దాడిని తీవ్రం చేసారు. తాజాగా వెన్నుపోటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. "బాబు గారి వెన్నుపోటు మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింది అంటూ ట్వీట్ చేశారు. పాపం పండి బాబు పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే రాజకీయాల నుంచి కూడా నిష్క్రమణ తప్పదని హస్తినలో అనుకుంటున్నారని" పేర్కొన్నారు. "వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబూ, కానీ మీరు ఆంధ్రా ఔరంగజేబ్ గా కలకాలం గుర్తుండిపోతారు... పెద్దాయన సాక్షిగా!" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసారు. "వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా! సోనియమ్మకు వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ విమర్శించారు. అంతేకాకుండా "తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటుదారుడు జగన్ ను నమ్మితే అంతేనంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారట!" అంటూ బుద్ధా వెంకన్న ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.