Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అప్పుడు 1700 కోట్లు కొట్టేసారు, ఇప్పుడు రద్దు చేసారు.. బిల్డప్ ఎందుకు శకుని మామా
posted on: Sep 27, 2019 4:37PM
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'శకుని మామా' అంటూ వరుస ట్వీట్లతో సెటైర్లు వేశారు. "స్క్రిప్ట్ మార్చు శకుని మామా. గతంలో రాసిన స్క్రిప్ట్ తో ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలెక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు." అంటూ విజయ సాయిని ట్యాగ్ చేసి ట్వీట్ చేసారు. "ఆ విషయం ఇంకా నీకు అర్ధం కాలేదా ? నీ బది'లీలలు' త్వరలోనే బయటకి వస్తాయి. కిలోమీటర్ల లెక్కన నొక్కేసే ప్రతి రూపాయికి లెక్క రాసుకో. ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే లావైపోతావు శకుని మామా!!" అంటూ మరో ట్వీట్ లో ఎద్దేవా చేసారు.
"రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి కవల పిల్లలు గాలి, జగ్గు చేసిన మైనింగ్ సంగతిని మర్చిపోయావా శకుని మామా? ఎలా మర్చిపోతావ్ లే లెక్క రాసింది నువ్వేగా. అన్నట్టు బాక్సైట్ మైనింగ్ అని ఏదో అంటున్నావ్ ఏంటా సంగతి ?. 2007లో మీ మహామేత విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వుకొని దోచుకోవడానికి రస్ అల్ ఖైమా కంపెనీ పేరుతో అనుమతులు ఇచ్చారు దాని గురించేనా? అవి చంద్రబాబుగారు ఎప్పుడో రద్దు చేస్తే, ఇప్పుడు తండ్రి ఇచ్చిన అనుమతులు కొడుకు రద్దు చేసాడు అని బిల్డప్ ఎందుకు శకుని మామా. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇప్పించినందుకే 1700 కోట్లు అప్పట్లో మీరు కొట్టేసారు కదా మర్చిపోయావా? ఒకసారి పాత పద్దుల పుస్తకం తిరగేయ్ బాక్సైట్ లెక్క ఉంటుంది. పుస్తకాలు కాల్చేస్తే లెక్క సీబీఐ దగ్గర దొరుకుతుంది ఒక్క సారి అడిగి చూడు శకునిమమా !!" అంటూ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు.






