TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీటెక్ విద్యార్థి దారుణ హత్య

Published on: Fri May 8, 2026 8:38AM

సికింద్రాబాద్‌లోని చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధి లో  ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు  కత్తులతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు.  అల్వాల్‌కు చెందిన యువన్ అలియాస్ అఖిల్  అనే యువకుడు మల్లారెడ్డి కాలేజీలో బీటెక్   చదువుతు న్నాడు. గత కొంతకాలంగా సీతాఫల్ మండి  ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమి స్తున్నాడు. ఆమెను కలిసేం దుకు తరచుగా సీతాఫ ల్ మండి ప్రాంతానికి వస్తుండే వాడు. అలాగే  గురువారం (మే 7) రాత్రి   9 గంటల సమయంలో సీతాఫల్ మండి వచ్చాడు.  ఇందిరానగర్ కాలనీలో స్నేహితులతో కలిసి మొబై ల్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తు న్న సమయంలో అమ్మాయి తరపు వారు పది మంది ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు.

యువన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నిందితులు ఒక్కసారిగా యువన్ పై కత్తులతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే తల, మెడ, చేతులపై  విచక్ష ణారహితం గా కత్తులతో దాడి చేయడంతో యువన్ అక్కడికక్కడే కుప్పకూ లిపోయాడు.  నిందితులు యువకుడు యువన్ ను హత్య చేసి అనంతరం అక్కడి నుండి పారిపోయారు...ఆ తర్వాత  స్నేహితులు అతడిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించగా..  అప్పటికే యువన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి శరీరంపై సుమారు 15 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ గాంధీ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు.