TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర రైతుల ఉసురు తీస్తున్న బి.టి. పత్తి విత్తనాలు

Published on: Tue Jun 26, 2012 11:47AM

సకాలంలో వర్షాలు,వాతావరణం,కూలీలు, మార్కెట్‌ అన్నీ కలిసొస్తేనే వ్యవసాయం లేక పోతే జూదం అని మన రైతులు బాధపడుతున్నారు. గోరు చుట్టుమీద రోకలిపోటులా పొలంలో వేసిన బిటి పత్తి విత్తనాలే సరిగ్గా మొలకెత్తక పోవడం పంటను పురుగులు ఆశించడం, ఖర్చుకు తగ్గ దిగుబడి రావకపోవడం చూస్తే దాన్ని ప్రోత్సహించిన సర్కారు రైతులజీవితాలతో ఆడుకోవటమే అవుతుంది. 2004 -2005 లో రాష్ట్ర సాగు విస్తీర్ణంలో ప్రత్తి పంట సాగు 5.70 శాతం మాత్రమే. ఆ సంవత్సరం రైతులకు సాంప్రదాయ పంటలకు రాని లాభాలను ఈ వాణిజ్య పంట ఇచ్చింది. రైతులంతా తమ బిటి విత్తనాల ప్రత్తిని తెల్లబంగారం అని మురిసిపోయారు. ఇది చూసిన చుట్టు ప్రక్క రైతులు కూడా ఈ పంట వేశారు. 2009 -10 సంవత్సరంనాటికి రైతులు సాగు విస్తీర్ణాన్ని బాగా పెంచారు. ఆ సంవత్సరం రైతులు 450 నుండి 475 క్వింటాళ్ల వరకు హెక్టారుకు పండిరచారు. అయితే వారు దానికి యాభై శాతం కంటె ఎక్కువే ఖర్చుపెట్టవలసి వచ్చింది. ఆ తరువాత అదీ లేకుండా పోయింది.

 

ఈ నేపధ్యంలో సాంప్రదాయ పంటలు పండిరచక పోవడంతో అపరాల కొరత ఏర్పడి పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటా యి. 2011 సంవత్సరంలో 33.7 లక్షల ఎకరాల్లో బి టి విత్తనాలు వేస్తే లక్ష ఎకరాల్లో పంట పురుగుల బారినపడి చేతికందకుండా పోవటంతో రైతన్నలు భారీగా నష్టపోయారు. నష్టాన్ని తట్టుకోలేని రైతులు పురుగు మందును తాగి మరణించారు. పురుగుల్ని చంపలేని పురుగు మందులు రైతుల్ని మాత్రం బలి తీసుకున్నాయి. దీనంతటికి కారణం బిటి విత్తనాలకు ఎరువులు, క్రిమికీటక నాశనలు వాడనక్కర్లేదని, ఒకే పంటతో రైతులు లాభాల బాట పట్టవచ్చని, హరిత విప్లవం అని కాకమ్మ కబుర్లు చెప్పి మెన్‌శాంటో తదితర కంపెనీలు భారత ప్రభుత్వం తో ఏర్పరుచుకున్న ఎంఒయు ఒప్పంద ఫలితమే. బి.టి.కాటన్‌ వల్ల గుంటూరు, వరంగల్‌, మెదక్‌, ప్రకాశం జిల్లా రైతులు బాగా దెబ్బతిన్నారు. మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి బ్రతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆగ్రహించిన మెదక్‌ మహిళారైతులు బిటి విత్తనాలను రద్దు చేయాలని ప్రదర్శన చేపట్టి కలెక్టరుకు వినతి పత్రం ఇచ్చారు. ఫలితం శూన్యం.

 

ఇంకా ఇంకా రైతులు మోస్తూనే ఉన్నారు. కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు జరిపి పరిశోధనలో బిటి విత్తనాల వాడుక వల్ల గాలి, నీరు, నేల కలుషిత మవుతున్నాయని తెలిసింది. ఈ పొలాల్లో మేసిన పశువులు చని పోతున్నాయని తేలింది. అయినా ప్రభుత్వం చలించలేదు. ఈ ఏడాది ఇంకా రాని వర్షాలు మొలకెత్తని విత్తనాలు రైతుకు గుండె బేజారెత్తించే అంశాలు. అందుకే బిటి విత్తనాల స్థానంలో అపరాలు వేయాలని రైతులను శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. మహిళా రైతులు కూడా అటే మొగ్గు చూపుతున్నారు. పప్పుదినుసుల కొరత, వాటికిప్పుడున్న ధర కూడా రైతులకు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కందులు ,పెసలు, మినుములు వంటనూనెలకు గాను నువ్వులు, వేరుశనగ లాంటి పంటలు రైతులకు మేలు సాటి వ్యవసాయంగా వుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పంటలను పండిరచి రైతన్నలు లాభాలబాట పట్టగలరని ఆశిద్దాం.