ఎంపీకి కొవిడ్.. పార్లమెంట్ లో కలకలం
Published on: Tue Dec 21, 2021 3:01PM
పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఓ ఎంపీకి కొవిడ్ సోకడం కలకలం రేపుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ ఓ ఎంపీ కరోనా బారినపడ్డారు. సోమవారం వరకు లోక్‌సభకు హాజరైన తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ వెల్లడించారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నప్పటికీ వైరస్ సోకిందని ట్వీట్ చేశారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని భావిస్తున్నట్టు ఎంపీ డానిష్ అలీ చెప్పారు. తన ట్వీట్‌ను లోక్‌సభ స్పీకర్, లోక్‌సభ సెక్రటేరియట్‌కు ట్యాగ్ చేశారు.

బీఎస్పీ ఎంపీ డానిష్ అలీకి కొవిడ్ నిర్దారణ కావడంతో పార్లమెంట్ లో అలజడి రేగింది. వైరస్ సోకిన ఎంపీ లోక్ సభలో అందరిని కలిశారని చెబుతున్నారు. సభ లోపల, బయట కూడా సహచర ఎంపీలతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని తెలుస్తోంది. దీంతో బీఎస్పీ ఎంపీని కలిసిన నేతలంతా వణికిపోతున్నారు. కొవిడ్ టెస్టు కోసం పరుగులు పెడుతున్నారు.


