పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులు మూస్తాం...

 

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బీఎస్ఎఫ్ అకాడ‌మీలో  పాసింగ్ ఔట్ ప‌రేడ్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల వ‌ద్ద బీఎస్ఎఫ్ ద‌ళాలు అనునిత్యం అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయ‌న్నారు. బోర్డ‌ర్ వ‌ద్ద బీఎస్ఎఫ్ ద‌ళాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని కూడా పొరుగు దేశాలు గ్ర‌హించాయ‌న్నారు. దీనిలోభాగంగానే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని.. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు భారత్‌ తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. పాసింగ్ ఔట్ ప‌రేడ్ సంద‌ర్భంగా బీఎస్ఎఫ్ క్యాడెట్ల‌కు రాజ్‌నాథ్ అవార్డులు ప్ర‌దానం చేశారు.