ఢిల్లీలో కూలిపోయిన బీఎస్ఎఫ్ విమానం..
Published on: Tue Dec 22, 2015 11:56AM

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ విమానాశ్రాయానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకా ప్రాంతం సమీపంలో బీఎస్ఎఫ్ చార్టర్ విమానం కుప్పకూలిపోయింది. ఈప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు పైలెట్, మరొకరు కోపైలెట్ కాగా మిగిలిన వారిలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులు విమాన సిబ్బంది, మిగితావారు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు స్థానికులకు కూడా గాయాలయ్యాయి.


